English Version             

 

కార్యక్రమ |  పత్రాలకు ఆహ్వానం  |  నిర్వాహక వర్గం |  పత్ర సమర్పణ  |   నమోదు  |    వేదిక     |    పత్రికారంగం  చిరునామ   |  మొదటి పుట   | సిలికానాంధ్ర

 
     

ప్రసార సాంకేతిక విభాగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు  సిలికానాంధ్ర - విశ్వ తెలుగు అంతర్జాల వేదిక (GIFT) సమర్పిస్తున్న
అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశం 2011
సెప్టెంబరు 28-30, 2011 - ఇండియా కమ్యూనిటీ సెంటర్, మిల్పీటస్, కాలిఫోర్నియా, అ.సం.రా


పత్రికా ప్రకటన

ప్రసార సాంకేతిక విభాగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

మరియు

సిలికానాంధ్ర

విశ్వ తెలుగు అంతర్జాల వేదిక (GIFT)

సమర్పిస్తున్న

అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశం 2011

సెప్టెంబరు 28-30, 2011

ఇండియా కమ్యూనిటీ సెంటర్, మిల్పీటస్, కాలిఫోర్నియా, అ.సం.రా

అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశానికి (ITIC-2011) మీకు ఇదే మా హృదయపూర్వక స్వాగతం. ఇది తెలుగు భాషాభివృద్ధి కోసం అంతర్జాల మరియు ప్రసార సాంకేతిక ఉపయోగాల గురించి జరిగే మొట్టమొదటి సమావేశం. ITIC 2011 సెప్టెంబర్ 28 నుండి 30 వరకు సిలికాన్ వ్యాలీ, CA, USAలో నిర్వహించబడుతుంది.

చాలా మంది నిపుణులు అంతర్జాల, ప్రసార సాంకేతిక క్షేత్రాలలో  పని చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా తెలుగు భాషకు సమాచార సంబంధ అధ్యయనానికి వీరందరినీ ఒకచోట సమావేశపరచవలసిన అవసరం వచ్చింది.

సమావేశంలో పాల్గొనడానికీ, చర్చలలో పంచుకోవడానికీ మీ అందరికీ స్వాగతం.

ITIC 2011 లోని కొన్ని ముఖ్యాంశాలు.

  • తెలుగు చరిత్రలో ఇది మొదటిది.

  • మొట్టమొదటిసారిగా అమెరికాలో తెలుగు అంతర్జాల ప్రదర్శన జరిపే యోచన

  • తెలుగు కంప్యూటింగ్ లోని అనువర్తనాలపై పత్ర సమర్పణ.

  • తెలుగు భాషకు కంప్యూటర్ అవసరాల గురించిన ప్రత్యేక గోష్టి.

  • చిన్న పిల్లలు తెలుగు కంప్యూటర్ ఉపయోగించడానికి సంబంధించిన ప్రత్యేక గోష్టి.

  • తెలుగు యూనీకోడ్ లిపి ప్రావీణ్యుల ప్రత్యేక గోష్టి.

  • ఇంకా ఇలా..ఎన్నో..

ITIC వివరాలు http://gift.siliconandhra.org లో ఉంచబడ్డాయి. అదనపు సమాచారం కావాలనుకుంటే నన్ను గానీ ఇతర అధ్యక్షులను గానీ నిరభ్యంతరంగా సంప్రదించవచ్చు.

ఆనంద్ కూచిభొట్ల

అధ్యక్షులు, సిలికానాంధ్ర.

anand@siliconandhra.org


సంక్షిప్త పత్ర సమర్పణకు ప్రకటన

ప్రపంచ తెలుగు అంతర్జాల వేదిక (GIFT) అంతర్జాల తెలుగు అంతర్జాల సమావేశం 2011 (క్రమంలో మొదటిది) ఇండియన్ కమ్యూనిటీ సెంటర్, మిల్పీటస్, యు.ఎస్.ఏలో  సెప్టెంబర్ 28-30, 2011లలో జరుగుతుంది తెలియజేయడానికి ప్రపంచ తెలుగు అంతర్జాల వేదిక సంతోషిస్తోంది.

ఆచార్య పేరి భాస్కరరావు (టోక్యో) సమావేశానికి అధ్యక్షత వహించడానికి అంగీకరించారు. ఆచార్య జి.ఉమామహేశ్వరరావు (హైదరాబాద్ విశ్వవిద్యాలయం) సమావేశ కార్యక్రమ కమిటీకి కన్వీనరుగా ఉండడానికి సమ్మతి తెలిపారు. సమావేశానికి సంబంధించిన కమిటీల వివరాలు త్వరలో తెలియజేయబడతాయి. సమావేశ నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా దిలీప్ కొండిపర్తి ఉంటారు. సమావేశ సచివాలయ కమిటీకి కిరణ్ ప్రభ అధ్యక్షత వహిస్తారు.

తెలుగులో కంప్యూటరు ఉపయోగాన్ని పెంచే ఉద్దేశ్యముతో ఈ సమావేశ విషయాన్ని ‘అంతర్జాల యుగంలో తెలుగు’ గా నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలుగు కంప్యూటరు మరియు అంతర్జాలం సందర్భంలో తెలుగు కంప్యూటరీకరణకు సంబంధించిన భాషా సాహిత్య పరిశోధన సాంకేతిక పత్రాలను ఆహ్వానిస్తున్నాము. మీ సంక్షిప్త పత్రాలను ఆగస్ట్ 7, 2011 లోపల పంపగలరు.

ప్రారంభ సమావేశమూ, ITIC 2011 లో తెలుగు అంతర్జాలానికి సంబంధించిన నిశిత (ఇంటెన్సివ్) మరియు విస్తృత (ఎక్స్టెన్సివ్) సాంకేతిక సెషన్లూ ఉంటాయి. కింద ప్రాథమిక జాబితా సూచించబడింది. (ఇది తరువాత విస్తరించవచ్చు).

భాషా సాంకేతిక ఉపకరణాలు :

  • ఫాంటులు, పాఠ లేక పదపరిష్కరిణులు (text or word editors), గుణింత పరిష్కరిణులు(spell - checkers), వ్యాకరణ పరిష్కరిణులు (grammeer - checkers), పద విశ్లేషణలు (Morphological analyzers) మరియు పదజనకాలు (word generators), పదవిభాగ నిర్ణాయకాలు (POS taggers), వాక్య విశ్లేషణులు (parsers) మొదలైనవి. యాంత్రానువాదకాలు, దృశ్యాత్మక వర్ణ నిర్ణాయకాలు (Optical Charter Recognition systems); వాగ్య్వవస్థ (Speech Systems) I/O సిస్టమ్, ఉచ్చారణ నిఘంటు సూచి (Pronunciation Lexicon Specification(PLS)).

  • తెలుగు సంగణక (కాంప్యుటేషనల్) పదకోశాలు : తెలుగు ఎలక్ట్రానిక్ / డిజిటల్ నిఘంటువులు (ఏకభాషా, ద్విభాషా, బహుభాషా నిఘంటువులు); మాండలిక పదకోశాలు.

  • తెలుగు పాఠ్యనిధి (కార్పస్) : ప్రాచీన, శాసన, గ్రాంథిక మరియు ఆధునిక పాఠ్యాలు : మాండలికాలు, క్షేత్రం : సాహిత్య, సాంఘిక, శాస్త్ర, శాస్త్రసాంకేతిక, వైద్య, న్యాయశాస్త్రాలు మొదలైన రంగాలు: టీకా (ఏనోటేషన్) మరియు విశ్లేషణ.

  • తెలుగు అన్వేషణ యంత్రం.

  • అంతర్జాలం/వెబ్ లో తెలుగులో పాఠ్య అభివృద్ధి (Content Development); డిజిటల్ లైబ్రరీలు; జాలువారే శైలీ పత్ర ప్రామాణికం (కాస్కాడింగే స్టైల్ షీట్ స్టాండర్డు)

  • తెలుగు కంప్యూటరు విశ్లేషణ : తెలుగు భాషాశాస్త్ర అధ్యయనం, కంప్యూటరు పరికరాల ద్వారా నిర్మిత వ్యాకరణాలు.

  • తెలుగు కంప్యూటింగ్ పరికరాలు : ప్లగ్ - ఇన్ లు, శోధకాలు (బ్రౌజర్లు), మార్పిడులు (కన్వర్టర్లు).

  • మొబైల్ ఫోన్ లలో, PDAలలో, ఐ-ఫోన్ లలో తెలుగు వ్యవస్థ, మరియు తెలుగులో రేస్టరైజర్ అండ్ లే అవుట్ ఇంజిన్ లు తయారు చేయటం.

  • తెలుగు యూనీకోడ్ క్యారక్టర్ ఎన్ కోడింగ్ సంబంధించిన విషయాలు.

  • తెలుగు వర్ణాల (క్యారెక్టర్) ఎన్ కోడింగ్ మరియు వివిధ సాఫ్ట్ వేర్ లతో కంప్యాటబులిటీ.

  • తెలుగు కీ  బోర్డు మరియు IME లు

  • వాణిజ్య పరమైన ఉపయోగాలు మరియు ఈ-వాణిజ్యం.

  • ఈ-వాణిజ్యంలో తెలుగు జాలికా తంత్ర (net technology) ఉపయోగాలు

  • తెలుగు సాఫ్టువేర్ స్థానీకరణం లోకలైజేషన్ మరియు OS మరియు ఓపెన్ సోర్స్ సాఫ్టువేర్.

పత్ర సమర్పణ, ఆమోదం

పత్ర సమర్పకులు తాము పంపాలనుకున్న సంక్షిప్త పత్రం (A4 పేజీ సగం) ఆగస్ట్ 7, 2011లోగా iticgift@gmail.com చిరునామాకి పంపాలి.

సంక్షిప్త పత్రాలు ఆగస్టు 10, 2011 వరకు పరిశీలింపబడతాయి.    పతం ఎంపిక అయిందో కాలేదో తెలియజేయబడుతుంది.  ఎంపికైన పత్రాల పూర్తి పత్రం మూడు నుండి నాలుగు పేజీల నిడివి కలవి  సెప్టెంబర్ 11, 2011 వరకు iticgift@gmail.com చిరునామాకి పంపాలి.

రూపకల్పన (ఫార్మేట్) :

మాధ్యమం : అన్ని పత్రాలూ (సంక్షిప్త మరియు పూర్తి పత్రాలు) ఎలక్ట్రానిక్ యూనికోడ్ ఎన్కోడింగ్ రూపంలో (రోమను మరియు తెలుగు) ఉండాలి. రోమన్ లో రాసినవి 12pt టైమ్స్ న్యూ రోమన్ లో ఉండాలి. తెలుగులో రాసినవి యూనీకోడ్ అనుసరిత ఎన్కోడింగ్ (ముఖ్యంగా గౌతమి గానీ, పోతన ఫాంటులలో గాని) ఉండాలి. యూనీకోడ్ అనుసరిత ఫాంటులో లేనివి స్వీకరించబడవు. కొన్ని సందర్భాలలో PDF  రూపంలో పూర్తి పేపరు అవసరం ఉంటుంది. (అవసరమైతే తెలియజేయబడుతుంది)

నమూనా : సంక్షిప్త పత్రం సమర్పించడానికి ఏ రకమైన నమూనా సూచించబడలేదు. పూర్తి పత్రం సమర్పించడానికి మాత్రం MS Word నమూనా ఫైల్ సూచించబడింది. ఇది సమావేశం వెబ్ సైట్ లో ఉంచబడుతుంది. నమూనా వాడినా వాడకపోయినా పైన తెలిపిన యూనీకోడ్ అనుసరణ మాత్రం తప్పనిసరి.

సమావేశ పూర్వ గోష్టీ పత్ర సంపుటం :

ఎంపికైన అన్ని పత్రాలు  సమావేశ-పూర్వ-గోష్టీ పత్ర సంపుటంలో (ముద్రిత లేదా ఎలక్ట్రానిక్ రూపంలో లేదా రెండింటిలో) ఉంచుతారు. ఈ సంపుటం సమావేశ సమయానికి అందుబాటులోకి వస్తుంది.

పత్ర సమర్పణ: ఎంపికైన పత్రాలను రచయితలే సదస్సులలో స్వయంగా సమర్పించవలసి ఉంటుంది. గైర్హాజరీలో పత్రం చదివే వీలుండదు. పత్ర సమర్పణకు సమయం కేటాయింపు మొదలైన వాటి గురించి సమావేశ సమయంలో తెలియజేయబడతాయి.

సంక్షిప్త పత్రాలూ, పూర్తి పత్రాలూ పంపవలసిన చిరునామా : iticgift@gmail.com

 

ఇమెయిలు:  iticgift@gmail.com

 

కార్యక్రమ |  పత్రాలకు ఆహ్వానం  |  నిర్వాహక వర్గం |  పత్ర సమర్పణ  |   నమోదు  |    వేదిక     |    పత్రికారంగం  చిరునామ   |  మొదటి పుట   | సిలికానాంధ్ర


   


 

 

Site Powered by: Agnatech