పత్ర సమర్పణ, ఆమోదం
పత్ర సమర్పకులు తాము పంపాలనుకున్న సంక్షిప్త పత్రం
(A4 పేజీ సగం) ఆగస్ట్ 7, 2011లోగా
iticgift@gmail.com చిరునామాకి పంపాలి.
సంక్షిప్త పత్రాలు ఆగస్టు 10, 2011 వరకు
పరిశీలింపబడతాయి. పత్రం ఎంపిక అయిందో కాలేదో
తెలియజేయబడుతుంది. ఎంపికైన పత్రాల పూర్తి పత్రం మూడు నుండి నాలుగు
పేజీల నిడివి కలవి సెప్టెంబర్ 11, 2011 వరకు
iticgift@gmail.com చిరునామాకి పంపాలి.
రూపకల్పన (ఫార్మేట్) :
మాధ్యమం :
అన్ని పత్రాలూ (సంక్షిప్త మరియు పూర్తి పత్రాలు) ఎలక్ట్రానిక్
యూనికోడ్ ఎన్‌కోడింగ్ రూపంలో (రోమను మరియు తెలుగు) ఉండాలి. రోమన్ లో
రాసినవి 12pt టైమ్స్ న్యూ రోమన్ లో ఉండాలి. తెలుగులో రాసినవి యూనీకోడ్
అనుసరిత ఎన్కోడింగ్ (ముఖ్యంగా గౌతమి గానీ, పోతన ఫాంటులలో గాని) ఉండాలి.
యూనీకోడ్ అనుసరిత ఫాంటులో లేనివి స్వీకరించబడవు. కొన్ని సందర్భాలలో PDF
రూపంలో పూర్తి పేపరు అవసరం ఉంటుంది. (అవసరమైతే తెలియజేయబడుతుంది)
నమూనా :
సంక్షిప్త పత్రం సమర్పించడానికి ఏ రకమైన నమూనా సూచించబడలేదు. పూర్తి పత్రం
సమర్పించడానికి మాత్రం MS Word నమూనా ఫైల్ సూచించబడింది. ఇది సమావేశం
వెబ్‌సైట్ లో ఉంచబడుతుంది. నమూనా వాడినా వాడకపోయినా పైన తెలిపిన యూనీకోడ్
అనుసరణ మాత్రం తప్పనిసరి.
సమావేశ పూర్వ గోష్టీ పత్ర
సంపుటం :
ఎంపికైన అన్ని పత్రాలు సమావేశ-పూర్వ-గోష్టీ
పత్ర సంపుటంలో (ముద్రిత లేదా ఎలక్ట్రానిక్ రూపంలో లేదా రెండింటిలో)
ఉంచుతారు. ఈ సంపుటం సమావేశ సమయానికి అందుబాటులోకి వస్తుంది.
పత్ర సమర్పణ:
ఎంపికైన పత్రాలను రచయితలే సదస్సులలో
స్వయంగా సమర్పించవలసి ఉంటుంది. గైర్హాజరీలో పత్రం చదివే వీలుండదు. పత్ర
సమర్పణకు సమయం కేటాయింపు మొదలైన వాటి గురించి సమావేశ సమయంలో
తెలియజేయబడతాయి.
సంక్షిప్త పత్రాలూ, పూర్తి పత్రాలూ పంపవలసిన
చిరునామా : iticgift@gmail.com |